Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడే టైటిల్ గెలిచాడు... అంతలోనే తుదిశ్వాస విడిచాడు!

  • ఇంగ్లిష్ టైటిల్ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ టైటిల్‌ ఫైట్ లో డెక్ స్పెల్ మన్ పై విజయం సాధించిన స్కాట్ వెస్ట్ గార్త్
  • గెలుపు సంబరాలు చేసుకున్న వెస్ట్ గార్త్
  • పోస్టు మ్యాచ్ ఇంటర్యూ ఇచ్చేందుకు వెళ్తూ కుప్పకూలిన వెస్ట్ గార్త్
టైటిల్ గెలిచిన కాసేపటికే బ్రిటిష్‌ బాక్సర్‌ స్కాట్‌ వెస్ట్‌ గార్త్‌ నిజ జీవితంలో ఓడిపోయిన ఘటన డాన్ కాస్టర్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్ లోని డాన్ కాస్టర్ లో ఇంగ్లిష్ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ టైటిల్‌ ఫైట్ జరిగింది. ఈ పోటీలో డెక్ స్పెల్ మన్ తో స్కాట్ వెస్ట్ గార్త్ తలపడ్డాడు. విజయం సాధించిన వెస్ట్ గార్త్ సంబరాల్లో మునిగిపోయాడు.

బాక్సింగ్ రింగ్ లోనే గెలుపు సంబరాలు చేసుకున్న వెస్ట్ గార్త్ పోస్ట్‌ మ్యాచ్‌ ఇంటర్య్వూ ఇచ్చేందుకు యాంకర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో కొద్దిపాటి గుండెనొప్పితో బాధపడిన వెస్ట్ గార్త్, కొన్ని క్షణాల తరువాత ఉన్నపళంగా నేలపై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వైద్యులు ప్రథమచికిత్స చేసి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

దీంతో టోర్నీలో విజయం సాధించిన వెస్ట్ గార్త్ తన జీవితంలో మాత్రం ఓడిపోయాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన తరువాత 10 ఫైట్లు చేసిన వెస్ట్ గార్త్ 7 ఫైట్లలో విజయం సాధించాడు. ఇంగ్లిష్ హెవీవెయిట్ బాక్సింగ్ టైటిలే అతని చివరి టైటిల్ అయింది. 
boxing
scott west garth
dec spellman

More Telugu News